మళ్ళీ సాలిడ్ యాక్షన్ తోనే స్టార్ట్ చేయనున్న ప్రభాస్.?

Published on Apr 8, 2022 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడి “ఆదిపురుష్” అనే భారీ మైథలాజికల్ డ్రామా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. ఇంకా ఇది పక్కన పెడితే షూటింగ్ ప్రోగ్రెస్ లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే రీసెంట్ గా తన భారీ సినిమా “రాధే శ్యామ్” రిలీజ్ అనంతరం చిన్న సర్జరీ చేయించుకున్నాడు.

మరి ఇపుడు కాస్త రెస్ట్ లో ఉన్న ప్రభాస్ దీని తర్వాత షూటింగ్ లో పాల్గొననున్నాడు. అయితే ఈ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే చేయబోయే రెండు సినిమాలు “సలార్” మరియు “ప్రాజెక్ట్ కే” రెండు సినిమాలు కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లతోనే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. అలాగే ఏకకాలంలో ఈ రెండు షూటింగ్స్ లో డార్లింగ్ పాల్గొననున్నాడట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :