మరోసారి ఆసక్తిగా చరణ్ – పవన్ బాండ్.!

Published on Mar 16, 2023 11:47 pm IST


మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోస్ లో అపారమైన ఆదరణ కలిగిన వారిలో మెగాస్టార్ తర్వాత అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే తమ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లే అని చెప్పాలి. మరి చరణ్ కి పవన్ తో ఎలాంటి అనుబంధం ఉందొ అందరికీ తెలిసిందే. అయితే పవన్ చరణ్ లు బాబాయ్ అబ్బాయ్ ల కంటే కూడా మంచి స్నేహితులుగా అన్నదమ్ములుగా అయితే కనిపిస్తారు.

మరి పవన్ విషయంలో చరణ్ ఇది వరకే ఎన్నో సందర్భాల్లో ఎంత బలంగా నిలబడగలడో చూపించాడు. ఇక అభిమానులు కూడా అంతే.. మరి ఇప్పుడు మరోసారి వీరి బాండ్ ఎంత బలంగా ఉందో అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

చరణ్ పుట్టిన రోజు కానుకగా ప్లాన్ చేసిన ఈ సినిమా వసూళ్లు ఎంతైతే నమోదు అవుతాయో ఆ వసూళ్లు పవన్ పొలిటికల్ పార్టీ జనసేన కు విరాళంగా అందించనున్నారట. దీనితో మరోసారి చరణ్ మరియు పవన్ ల బంధం ఫ్యాన్స్ లో కూడా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చని మూవీ లవర్స్ మరియు జెనరల్ ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :