“పుష్ప పార్ట్ 2” యుఫోరియా కోసం హాట్ టాపిక్ గా చర్చ..!

Published on Apr 14, 2022 5:15 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రీసెంట్ భారీ హిట్ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి స్యూర్ షాట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా అయితే హిందీ బెల్ట్ లో చేసిన వండర్స్ చూసి ట్రేడ్ వర్గాల వారు షాకయ్యారు. పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకుండా అక్కడ బాక్సాఫీస్ దగ్గర రంగంలో దిగిన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల మార్క్ ని క్రాస్ చేసి భారీ హిట్ అయ్యింది.

ఇక దీనికి రెండో పార్ట్ కూడా అనౌన్స్ చెయ్యడంతో అక్కడ ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు పలు సీక్వెల్ మరియు సౌత్ నుంచి వెళ్లిన పలు భారీ సినిమాలు హ్యూజ్ రెస్పాన్స్ ని హిందీ బెల్ట్ లో కొల్లగొడుతుండడంతో ఇపుడు మళ్ళీ పుష్ప పార్ట్ 2 యుఫోరియా కోసం సోషల్ మీడియాలో ఆసక్తిగా హాట్ టాపిక్ నడుస్తుంది.

ఎలాంటి హైప్ లేకుండానే పుష్ప మొదటి సినిమా హిందీలో అందులోని పలు రెస్ట్రిక్షన్స్, 50 శాతం ఆక్యుపెన్సీ తో అదరగొడితే ఇప్పుడు ఏమీ లేకుండా సరైన ప్రమోషన్స్ చేసి గాని దిగితే భారీ రెస్పాన్స్ మరియు ఐ=ఓపెనింగ్స్ ఈ చిత్రం అందుకుంటుంది అని ఫిల్మ్ ట్రాకర్స్ మాట. హిందీ ప్రేక్షకులు పుష్ప సీక్వెల్ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :