రజినీ మళ్ళీ అదే కాంబో రిపీట్ చెయ్యబోతున్నారట.!

Published on Dec 15, 2021 1:00 pm IST

తమిళ్ తలవైర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే”. తెలుగులో “పెద్దన్న” గా డబ్ అయ్యి గత దీపావళి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే కోలీవుడ్ లో ఏమో కానీ మన దగ్గర అయితే అనుకున్న స్థాయి విజయాన్ని ఈ చిత్రం అనుకోలేదు.

మొదట మంచి అంచనాలే ఉన్నా తర్వాత తర్వాత సరైన ప్రమోషన్స్ తెలుగులో లేక తక్కువ ఓపెనింగ్స్ నే ఈ చిత్రం అందుకుంది. ఇక ఇది చాలదు అన్నట్టు దర్శకుడు శివ పరమ రొటీన్ నేపథ్యం ఎంచుకొని సినిమాకి మరింత దెబ్బ తీసాడు. ఫైనల్ గా అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది.

కోలీవుడ్ దగ్గర అయితే బాగానే వసూళ్లు రాబట్టింది కానీ ఓవరాల్ గా మాత్రం తలైవర్, శివ కాంబో మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రిపీట్ కానున్నట్టు కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. రజినీ 169వ సినిమాగా దర్శకుడు శివ అదే పెద్దన్న సినిమాని నిర్మాణం వహించిన సన్ పిక్చర్స్ వారే నిర్మించనున్నారట. మరి ఈసారి అయినా సరైన కథతో శివ ట్రీట్ ఇస్తాడో లేక ‘పెద్దన్న 2’ లాంటిది తీస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :