మరోసారి “RRR” కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on May 21, 2022 6:01 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అనేక అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నిన్నటి నుంచే ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అయితే ఇప్పుడు మళ్ళీ అప్పుడు థియేటర్స్ లో ఆడియెన్స్ చూసి ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా సోషల్ మీడియాలో అందిస్తున్నారు. దీనితో మళ్ళీ ఈ చిత్రానికి అదిరే రెస్పాన్స్ వస్తున్నట్టు అయ్యిందని చెప్పాలి. టోటల్ భాషల్లో కూడా ఈ సినిమాపై మళ్ళీ మంచి అప్లాజ్ వస్తుండడం విశేషం.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన ఆలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా నటించింది. అలాగే చరణ్ మరియు తారక్ లు మన తెలుగు నేలకి చెందిన స్వాతంత్య్ర సమర వీరులు అల్లూరి సీతారామరాజు అలాగే కొమురం భీమ్ పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :