ఎక్కడాగిందో అక్కడ నుంచే మారుమోగుతున్న “RRR” పేరు.!

Published on Feb 8, 2022 2:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. వీరి కాంబోలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ఇప్పుడు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి జస్ట్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే వ్యవధి ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ మళ్ళీ సాలిడ్ ప్రమోషన్స్ తో సిద్ధం చేస్తుండగా ఆసక్తికకరంగా ఈ సినిమా ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే హాట్ టాపిక్ గా ఈ సినిమా పేరు మారు మోగుతుంది.

గత డిసెంబర్ 31న ముంబైలో గ్రాండ్ గా ప్లాన్ చేసిన భారీ ఈవెంట్ తో ఈ సినిమా పై హైప్ ఒక్కసారిగా ఇంకో లెవెల్ కి వెళ్ళింది. మరి ఆ తర్వాత కొత్త ఏడాది జనవరి 1 ఈ ఈవెంట్ తర్వాత ఈ సినిమా విడుదల ఆగినట్ అప్డేట్ ఇచ్చి షాకిచ్చారు. అక్కడ నుంచి మొత్తం సినిమా మళ్ళీ ఆగిపోయింది. కానీ ఎక్కడైతే ఆగిందో ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచే మేకర్స్ స్టార్ట్ చేశారు.

ఆ రోజు కొన్ని ఇష్యూస్ వల్ల పూర్తి ఈవెంట్ ని టెలికాస్ట్ చెయ్యడం కుదరకపోవడంతో నిన్నటి నుంచి ముందు టెలికాస్ట్ చెయ్యని ఫుల్ వీడియోస్ ని మేకర్స్ వదలడం స్టార్ట్ చేసారు అంతే కాకుండా మరోపక్క రాజమౌళి ఆ ఈవెంట్ లో చెప్పిన హైలైట్స్ మరోసారి ఈ భారీ సినిమా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో మారుమోగుతోంది.

సంబంధిత సమాచారం :