మరోసారి “బ్రహ్మాస్త్ర” కి అదే రీతి రెస్పాన్స్.!

మరోసారి “బ్రహ్మాస్త్ర” కి అదే రీతి రెస్పాన్స్.!

Published on Nov 6, 2022 10:00 AM IST

బాలీవుడ్ స్టార్ నటీ నటులు రణబీర్ కపూర్ అలాగే ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ ఏడాది బాలీవుడ్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత కాస్త మిక్సిడ్ టాక్ నే ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ కాగా మళ్లీ ఇక్కడ కూడా చూడని చాలా మంది నుంచి అదే మిక్సిడ్ టాక్ ని అయితే ఈ చిత్రం అందుకోవడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు కూడా కొంతమంది బాగుంది అని కొంతమంది బాలేదనే అంటున్నారు.

దీనితో ఈ చిత్రానికి అప్పటి రీతి రెస్పాన్స్ నే మళ్ళీ దక్కింది అని చెప్పాలి. కానీ ఈ చిత్రం అయితే ఇండియన్ సినిమా దగ్గర బెస్ట్ అండర్ రేటెడ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రంగా నిలిచింది అనే పాజిటివ్ టాక్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా షారుక్, అమితాబ్ లాంటి స్టార్స్ నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు