ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కోసం మరో స్పెషల్ ఈవెంట్..!

Published on Jan 28, 2022 3:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. అయితే ఇటీవల ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ రెండు డేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే కానీ కుదరకపోతే ఏప్రిల్ ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే కానీ ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్‌తో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్వరలోనే మరోసారి స్పెషల్ ఈవెంట్‌ని నిర్వహించాలని భావిస్తున్నారట. రిలీజ్ వాయిదా పడటంతో మరోసారి ఈ మూవీ ప్రమోషన్స్‌ని భారీ స్థాయిలో ప్రారంభించాలని అందుకు ముందుగా ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :