ఇప్పుడు బన్నీ వంతు..మళ్ళీ స్టైలిష్ స్టార్ డేస్ రాబోతున్నాయా?

ఇప్పుడు బన్నీ వంతు..మళ్ళీ స్టైలిష్ స్టార్ డేస్ రాబోతున్నాయా?

Published on Nov 16, 2022 7:30 PM IST


ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా తన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వైడ్ భారీ క్రేజ్ ని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. దీనితో ఇక నుంచి బన్నీ నుండి అన్నీ పాన్ ఇండియా సినిమాలు వస్తాయి. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేయకముందు నుంచే బన్నీ కి కానీ తన సినిమాలకి కానీ నార్త్ లో భారీ ఆదరణ ఉంది.

నిజానికి తాను ఐకాన్ స్టార్ గా మారక ముందు నుంచే అంటే తన ఎవర్ గ్రీన్ ట్యాగ్ స్టైలిష్ స్టార్ గా ఉన్నప్పుడు నుంచే పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ బన్నీ కి ఉండగా ఇప్పుడు మళ్ళీ స్టైలిష్ స్టార్ డేస్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. బన్నీ నటించిన చిత్రాల్లో తన కెరీర్ బిగ్ హిట్స్ లో ఒకటైన “రేస్ గుర్రం” చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ ప్లాన్ లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాకి 4కే వెర్షన్ లో మారుస్తుండగా దీనితో అయితే ఈ రీ రిలీజ్ లలో బన్నీ వంతు రానే వచ్చింది అని చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి బన్నీ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ రీ రిలీజ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు