టాక్..తన హిట్ డైరెక్టర్ తో సూర్య మరో ప్రాజెక్ట్.?

టాక్..తన హిట్ డైరెక్టర్ తో సూర్య మరో ప్రాజెక్ట్.?

Published on Mar 20, 2022 7:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “ఈటి”. తెలుగు మరియు తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మిక్సిడ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత సూర్య చేసిన మాస్ ప్రాజెక్ట్ అవ్వడంతో మొదట్లో మంచి హైప్ నెలకొంది కానీ తర్వాత మాత్రం అలా డ్రాప్ అయ్యింది. అందుకే తెలుగులో కూడా అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేదు.

ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ తన హిట్ డైరెక్టర్ తో సూర్య వర్క్ చెయ్యడం కన్ఫర్మ్ అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. “ఈటి” కన్నా ముందు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య వాటిలో “ఆకాశం నీ హద్దురా” అనే సినిమా సుధా కొంగర తో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో వీరి కాంబో మంచి క్రేజీగా మారింది. మరి మళ్ళీ ఈ కాంబోలో సినిమా ఉండొచ్చని కొత్త టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అనౌన్సమెంట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు