ఇంట్రెస్టింగ్..”భీమ్లా నాయక్” పై మళ్ళీ సస్పెన్స్..?

Published on Nov 18, 2021 1:25 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ మొన్ననే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడంతో అక్కడ నుంచి మళ్ళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఓ రకంగా భీమ్లా డేట్ తోనే కీలక భేటీలు కూడా జరిగాయని టాక్ ఉంది.

మరి దీనితో భీమ్లా నాయక్ రిలీజ్ కానీ ఇతర సినిమాల్లో ఏదోకటి కానీ డేట్ మార్చుకోవాల్సిందే అని ఇంకో స్టార్ట్ స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు మళ్ళీ భీమ్లా నాయక్ చుట్టూతా నే సస్పెన్స్ నెలకొన్నట్టు తెలుస్తుంది. మరి భీమ్లా నాయక్ కొత్త గా అనౌన్చేసిన అదే డేట్ తో వస్తుందా లేక ఓ కొత్త డేట్ కి రిలీజ్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే దీనిపై ఇంకో సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :