మళ్ళీ “పుష్ప” లో ఈ స్టార్ నటుడు అంటూ రూమర్స్.!

మళ్ళీ “పుష్ప” లో ఈ స్టార్ నటుడు అంటూ రూమర్స్.!

Published on Jul 3, 2022 8:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

మరి ఈ భారీ సినిమా ఇంత సక్సెస్ అయ్యాక ఇప్పుడు “పుష్ప ది రూల్” పై అనేక అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి సినిమాని మరింత గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమాలో ప్రముఖ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నాడు అంటూ పలు రూమర్స్ కొన్ని రోజులు నుంచి వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వెర్సిటైల్ నటుడుని సుకుమార్ ఆల్రెడీ పుష్ప 1 కోసమే తీసుకురావాల్సి ఉంది. కానీ అప్పుడు కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు