“RRR”..మరోసారి చరణ్, ఎన్టీఆర్ లపై భారీ ఎత్తున ప్రశంసలు.!

“RRR”..మరోసారి చరణ్, ఎన్టీఆర్ లపై భారీ ఎత్తున ప్రశంసలు.!

Published on Jun 4, 2022 7:02 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అనేక అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం థియేట్రికల్ గా రన్ కంప్లీట్ చేసి ఓటిటి లో కూడా వచ్చింది. అయితే ఇక్క నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక గ్లోబల్ గా మరింత స్థాయి రెస్పాన్స్ ని అందుకుంది.

దీని తర్వాత రీసెంట్ గా యూఎస్ లో స్పెషల్ షో ని వేయగా అక్కడ నుంచి మళ్ళీ ఇద్దరు హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లుపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇద్దరి పెర్ఫార్మెన్స్ లు వారి నుంచి సాలిడ్ యాక్షన్ లు చూసి మన దగ్గర కన్నా విదేశీయులు కొనియాడుతుండడం విశేషంగా మారింది.

మొత్తానికి అయితే మళ్ళీ ఈ ఇద్దరు హీరోల పేర్లు కూడా భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ సినిమాలు కూడా ఈ సినిమాని మ్యాచ్ చేసేలా ఉంటే వాటికి డెఫినెట్ గా మంచి రీచ్ వస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు