విశ్వక్ సేన్ సినిమా మరోసారి వాయిదా..మరో కొత్త డేట్ వస్తుంది!

Published on Apr 15, 2022 12:00 pm IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ మాస్ హీరోస్ లో ఒకడైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలతో తన లైనప్ ని సెట్ చేసుకొని వస్తున్నాడు. అయితే తన లోని మాస్ కి భిన్నంగా ఈసారి క్లాస్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేసిన సినిమానే “అశోక వనంలో అర్జున కళ్యాణం”.

దర్శకుడు విద్యా సాగర్ చింత తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా ఈ పాటికే పలు మార్లు రిలీజ్ డేట్ తెచ్చుకొని వాయిదా పడింది. మరి లాస్ట్ గా ఈ ఏప్రిల్ 22న ఫిక్స్ చేయగా మళ్ళీ దీని నుంచి మారుస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు.

ఈ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఈరోజు సాయంత్రం 5 గంటలకి రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ కొత్త డేట్ ఎప్పటికి ఫిక్స్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించగా జయ్ క్రిష్ సంగీతం అందించాడు. అలాగే ఎస్విసీసీ డిజిటల్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :