బీస్ట్ మోడ్ లో “ఏజెంట్” అఖిల్..వీడియో వైరల్.!

బీస్ట్ మోడ్ లో “ఏజెంట్” అఖిల్..వీడియో వైరల్.!

Published on Jun 30, 2022 4:00 PM IST

ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “ఏజెంట్”. దర్శకుడు సురేందర్ రెడ్డి తో అఖిల్ హీరోగా ఫస్ట్ టైం చేస్తున్న ఈ చిత్రం భారీ హంగులతో పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా కోసం గాను అఖిల్ తన దేహ ధారుడ్యాన్ని చాలా వరకు మార్చేశాడు. ఇంతకు ముందు ఎప్పుడు లేని ఫిట్నెస్ బాడీ ని సిద్ధం చేసి ఒక బీస్ట్ లా ఈ సినిమా కోసం మారిపోయాడు.

అయితే మరి లేటెస్ట్ గా తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో తాను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అది మంచి వైరల్ గా మారింది. దీనిలో మాత్రం అఖిల్ ఓ రేంజ్ లో కష్టపడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దీనితో ఈ బీస్ట్ మోడ్ లో ఉన్న ఏజెంట్ అఖిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇక ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు