అనుకున్నట్టే సెన్సేషనల్ రెస్పాన్స్ కొల్లగొడుతున్న “ఏజెంట్”..!

Published on Jul 16, 2022 8:01 am IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కించిన భారీ యాక్షన్ డ్రామా “ఏజెంట్” కూడా ఒకటి. అసలు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచే అఖిల్ కెరీర్ లో మళ్లీ అఖిల్ సినిమాని మించి నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది.

అలాగే ఒక్కో అప్డేట్ నుంచి టీజర్ వరకు కూడా ఆడియెన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఇక నిన్నటి టీజర్ తో అయితే అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చేసినట్టే అని చెప్పాలి. ఈ టీజర్ వచ్చి 13 గంటల్లోనే 64 లక్షలకు పైగా వ్యూస్ అలాగే 3 లక్షల 60 వేలకి పైగా లైక్స్ వచ్చేసాయి. ఇది మన టైర్ 2 హీరోస్ లోనే ఒక సెన్సేషనల్ రెస్పాన్స్.. అలాగే ఈ సినిమాపై అనుకున్నట్టుగానే ఉన్న అంచనాలకు తగ్గ రెస్పాన్స్ కూడా ఇదే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :