అజ్ఞాతవాసి బెనిఫిట్ షోస్ కు రంగం సిద్దం !

పవన్ కళ్యాణ్ & త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ జనవరి 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమా కోసం పవన్ పాడిన పాటను ఇటివల రికార్డింగ్ చేసారు. ఈ సాంగ్ డిసెంబర్ 31 న విడుదల చెయ్యనున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా నిర్మాత డిసెంబర్ 09 ఆర్ధరాత్రి బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసారని తెలిసింది. దీనికోసం ఈ నిర్మాత పోలిస్ అనుమతి కోరినట్లు సమాచారం. సినిమోపై భారి అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్లు ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అను ఇమ్మానుల్, కీర్తి సురేష్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నారు.