మినిస్టర్ కు అజ్ఞాతవాసి స్పెషల్ షో !

భారి అంచనాల మద్య ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అజ్ఞాతవాసి సినిమా. టిజర్ విడుదల చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు బారిగా పెరిగాయి. అనిరుద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుంది. కీర్తి సురేష్ అను ఇమ్మానుల్ గ్లామర్ సినిమాకు మరింత గ్లామర్ తెస్తుంది అనడంలో సందేహం లేదు.

ఈ రోజు ఉదయం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ లు తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సచివాలయంలో కలిసి ముచ్చటించారు. అజ్ఞాతవాసి సినిమా చూడ్డానికి రావాలని శ్రీనివాస్ యాదవ్ ను త్రివిక్రమ్ పిలిచినట్లు తెలుస్తోంది.