అజ్ఞాతవాసి బెనిఫిట్ షోస్ వివరాలు !

9th, January 2018 - 12:59:27 AM

జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ‘అజ్ఞాతవాసి’థియేటర్స్ లో సందడి చెయ్యబోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాబెనిఫిట్ షోస్ వెయ్యడానికి అనుమతి ఇచ్చింది. ఆంద్ర రాష్ట్రం అంతటా రేపు అర్ధ రాత్రి నుండి అజ్ఞాతవాసి హంగామా మొదలు కాబోతోంది. తెలంగాణాలో కూడా ఈ సినిమా మిడ్ నైట్ షోస్ ప్లాన్ చేసారు కాని అధికారికంగా ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని సమాచారం.

మరి కొద్ది సమయంలో తెలంగాణలో కూడా షోస్ కు పర్మిషన్స్ లభించే అవకాశం ఉంది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా కావున ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు ఎంత వసూళ్ళు చెయ్యబోతుందన్న విషయం పై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఆడియన్స్ ను అలరించే విధంగా ఉండబోతుందని సమాచారం.