‘అజ్ఞాతవాసి’ ఆడియో డేట్ ఫిక్స్ !

పవన్ కళ్యాణ్ నటించిన 25 వ సినిమా ‘అజ్ఞాతవాసి’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ‘గాలి వాలుగా’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటతో పాటు పవన్ కోసం ప్రత్యేకంగా రెడి చేసిన సాంగ్ ను అనిరుద్ ఈ రోజే విడుదల చెయ్యబోతున్నారు. భారీ అంచనాల మద్య జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అభిమానులందరు ఎంతగానో ఎదురు చూస్తోన్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక ఈ నెల 19 న హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఫ్యాన్స్ అత్యధికంగా హాజరయ్యే ఈ ఫంక్షన్ కు బయోమెట్రిక్ పాస్ లు రెడి చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. జే మీడియా ఈ ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతోంది.