‘అజ్ఞాతవాసి’ సెన్సార్ వివరాలు !

త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా ‘అజ్ఞాతవాసి’. ఆరంభం నుండి ఇప్పటి వరకు బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. మొన్ననే రిలీజైన టీజర్ కు బ్రహ్మాండమైన స్పందన కూడా వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ముమ్మరం చేసి చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమానికి రెడీ చేస్తోంది.

ఈ నెల 29న ఈ సెన్సార్ పనులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్ర ఆడియో వేడుక రేపు సాయంత్రం హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. యూఎస్ లో ఏ భారతీయ సినిమా విడుదలకాని రీతిలో అత్యధికంగా 560 కు పైగా స్క్రీన్లలో రిలీజవుతున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా కొత్త రికార్డుల్ని నెలకొల్పేందుకు సిద్దమైంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా మురళీ శర్మ, రావు రమేష్, కుష్బూ, బోమన్ ఇరానీలు కీలక పాత్రలో నటించారు.