‘అజ్ఞాతవాసి’ ఇన్ సైడ్ టాక్ ఏంటంటే !

12th, December 2017 - 03:36:32 PM

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫై ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టే డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో బిజినెస్ కూడా తారా స్థాయిలోనే జరిగింది. ఓవర్సీస్ రైట్స్ కూడా పెద్ద మొత్తానికే అమ్ముడయ్యాయి.

ఈ బిజినెస్ మొత్తం కలెక్షన్ల రూపంలో తిరిగిరావాలంటే ఓపెనింగ్స్ తో పాటు సినిమా అన్ని వర్గాల వారిని అలరించి భారీ హిట్ గా నిలవాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ సమాచారం మేరకు ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని, సినిమా అభిమానులను, ప్రేక్షకులను మెప్పించి, తొలిరోజే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవచడం ఖాయమని తెలుస్తోంది.

సాధారణంగా కాస్త పాజిటివ్ టాక్ వస్తేనే పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అలాంటిది మొదటిరోజే సూపర్ హిట్ టాక్ వస్తే ఆ విజయం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ వరకు ఆగాల్సిందే. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు.