‘అజ్ఞాతవాసి’ సెన్సార్ టాక్ !

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ నిన్న సాయంత్రం సెన్సార్ పనుల్ని పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన సంగతి తెలిసిందే. ఈ సర్టిఫికేట్ తో పాటే సినిమా ఎలా ఉందనే టాక్ కూడా బయటికొచ్చింది. ఈ టాక్ ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. పైగా కట్స్ కూడా పెద్దగా పడలేదట. దీంతో త్రివిక్రమ్ అనుకున్న ఔట్ ఫుట్ అలాగే ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇప్పటీకే బోలెడంత పాజిటివిటీని ఉన్న ఈ చిత్రానికి ఈ సెన్సార్ టాక్ మరింత బలాన్ని చేకూర్చనుంది. పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపి ఈ నెల 10న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా సరికొత్త రికార్డుల్ని నెలకొల్పడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సుమారు 570 స్క్రీన్లలో చిత్రం విడుదలకానుంది. ఇప్పటి వరకు యూఎస్లో ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో రిలీజ్ కావడం ఇదే మొదటిసారి.