ఓవర్సీస్లో దుమ్మురేపే కలెక్షన్స్ రాబట్టిన ‘అజ్ఞాతవాసి’ !

ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదలకాని స్థాయిలో సుమారు 570 కి పైగా స్క్రీన్లలో విడుదలైన పవన్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ చిత్రం పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టింది. కేవలం ప్రీమియర్ల ద్వారానే సుమారు 1.5 మిలియన్ల రాబట్టి ‘బాహుబలి-1’ రికార్డును క్రాస్ చేసేసిన ఈ చిత్రం మొదటి రోజుకు గాను 1.7 మిలియన్లను ఖాతాలో వేసుకుంది.

దీంతో ‘బాహుబలి-2’ తర్వాత అత్యదిక్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ నిలిచింది. వసూలు ఇదే స్థాయిలో గనులకు కొనసాగితే రెండవరోజుకు 2 మిలియన్లను అవలీలగా క్రాస్ చేసేస్తుంది ఈ చిత్రం. మరి మొదటిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రన్ చూపిస్తుందో చూడాలి.