నైజాం ఏరియాలో ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్స్ !

నైజాం ఏరియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ గురించి, ఆయన చిత్రాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. పవన్ కొత్త సినిమా ఏదైనా మొదటి రోజు నైజాంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించడం పరిపాటి. ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిన్న విడుదలైన 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ భారీ ఓపెనింగ్స్ సాధించింది.

మొదటి షో నుండే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఫస్ట్ డే రూ.5.40 కోట్ల షేర్ ను వసూలు చేసిందీ చిత్రం. ఇక 17 వరకు తేదీ వరకు రోజుకు 5 షోల అనుమతి ఉండటంతో పండుగ రోజుల్లో చిత్రం స్టడీ రన్ ను కనబర్చగలిగితే హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరిగే అవకాశముంది. ఇకపోతే ఈ చిత్ర నైజాం హక్కులు సుమారు రూ.27 కోట్ల పెద్ద మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక మిగతా ఏరియాల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.