దూసుకెళ్ళిపోతున్న ‘అజ్ఞాతవాసి’ టీజర్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్టగానో ఎదురుచూస్తున్న ‘అజ్ఞాతవాసి’ టీజర్ నిన్న సాయంత్రం 6 గంటల 30 నిముషాల సమయంలో విడుదలైంది. విడుదలైన కొద్దిసేపటికే టాప్ ట్రెండింగ్స్ లో నిలిచిన ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ లు సృష్టిస్తోయింది. మొదటి 5 గంటల్లోనే టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ టీజర్ గా అవతరించి రాత్రి 12 గంటలకే 3.11 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది.

అంతేగాక 15 గంటల్లోనే హారికా అండ్ హాసిని అఫీషియల్ ఛానెల్ ద్వారా 4.26 మిలియన్లకు చేరుకొని ఇంకొద్దిసేపట్లో 5 మిలియన్ల మార్కును తాకనుంది. త్రివిక్రమ్, పవన్ ల కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడం, ఇదే పవన్ యొక్క 25వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తారాస్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ఈ చిత్రం జవనరీ 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.