యూట్యూబ్ లో చెలరేగిపోతున్న ‘అజ్ఞాతవాసి’ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్ర ట్రైలర్ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రిలీజైన సంగతి తెలిసిందే. సాయంత్రం నుండి నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఇదిగో సవుతుంది అదిగో వస్తుందో అంటూ ఎంత ఆలస్యం చేసినా ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులు ట్రైలర్ విడుదలకాగానే రికార్డ్ స్థాయిలో వీక్షించడం మొదలుపెట్టారు. దాంతో అప్పటికప్పుడే టీజర్ ట్రెండింగ్స్ లో టాప్ స్థానములోకి వెళ్లపోయింది.

ఇక యూట్యూబ్ అఫీషియల్ చానెల్ లో అయితే ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ మార్కుకు చేరువై 24 గంటలు గడిచేలోపు సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ మధ్యే చెలరేగిన కాపీ రైట్స్ వివాదాన్ని అధిగమించి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈసారి యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు సాధ్యంకాని భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం రికార్డ్ ఓపెనింగ్స్ మీద కన్నేసింది.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :