‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ రిలీజ్ డేట్ !

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక నిన్న సాయన్తరం హైదరాబాద్లో అభిమానవుల సమక్షంలో ఘనంగా జరిగింది. పాటలన్నీ బాగుండటంతో అభిమానులు ఆడియోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటీకే విడుదలైన టీజర్ కూడా అశేష ప్రేక్షాదరణను పొంది 10 మిలియన్ల మార్కుకు చేరుకుంది. ఇకపోతే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర ట్రైలర్ డిసెంబర్ 26వ తేదీన రిలీజ్ కానుంది.

అంతేగాక సినిమాలో పవన్ ప్రత్యేకంగా పాడిన ‘కొడకా కోటేశ్వరరావ్’ అనే గీతాన్ని కొత్త సంవత్సరం సందర్బంగా 2018 జనవరి 1వ విడుదలచేయనున్నారు. త్రివిక్రమ్, పవన్ కలయికలో వస్తున్న ఈ మూడవ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు కథానాయకిలుగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేష్, కుష్బులు పలు కీలక పాత్రలో నటించారు.