‘అజ్ఞాతవాసి’ వన్ మ్యాన్ షోలా ఉండబోతోంది – ధరమ్ తేజ్

పవన్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి ‘ పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులంతా విడుదల తేదీ 10 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కేవలం అభిమానులే కాదు మెగా హీరోలది కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా పవన్ ను ఎక్కువగా అభిమానించే సాటి ధరమ్ తేజ్ అయితే ఒక అభిమానిగా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అన్నారు.

ఇక సినిమా గురించి ముందుగానే ఫలానా అంశం బాగుంటుందని, ఫలానా పాట బాగుంటుందని ఊహించుకోవడంలేదని, అభిమానులతో కలిసి విడుదలరోజు సినిమా చూడాలనే ఒక్క ఆలోచన మాత్రమే తనలో ఉందని, అంతేగాక అందరిలాగే తాను కూడా పవన్ స్క్రీన్ మీద ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూడాలని ఎగ్జైటెడ్ గా ఉన్నానని, అంతా వన్ మాన్ షోలాగనే ఉండబోతోందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.