చెన్నైలో కూడా హవా చూపించిన ‘అజ్ఞాతవాసి’ !

పవన్ కళ్యాణ్ యొక్క 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ నిన్న భారీ అంచనాలు నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. పవ, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రానికి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసిందీ చిత్రం. అంతేగాక తమిళనాట కూడా ఈ సినిమా యొక్క హవా కనబడింది.

చెన్నై నగరంలో రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం మొదటి రోజుకు గాను రూ.24 లక్షల గ్రాస్ ను రాబట్టుకుంది. అంతేగాక ఓవర్సీస్లో కూడా ప్రీమియర్స్ రూపంలో 1.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి ‘బాహుబలి-1’ రికార్డును తుడిచిపెట్టేసింది. ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా అనిరుద్ సంగీతాన్ని అందించారు.