‘అజ్ఞాతవాసి’ కృష్ణా జిల్లా వసూళ్లు !

ఈ సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాల్లో మొదటిది ‘అజ్ఞాతవాసి’. నిన్ననేను భారీ క్రేజ్ నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విమర్శకులు, అభిమానుల్ నుండి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయినా చిత్రంపై ఉన్న అంచనాలు మూలంగా ఓపెనింగ్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో లభించాయి.

నిన్న మొదటిరోజు ఈ చిత్రానికి కృష్ణా జిల్లా ఏరియాలో రూ.1.82 కోట్ల షేర్ లభించింది. కృష్ణా జిల్లా హక్కులు సుమారు రూ.8 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ మొత్తం రికవర్ కావాలంటే చిత్రం ఈ పండుగ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని స్టడీ రన్ ను కనబరచాల్సి ఉంటుంది.