‘అజ్ఞాతవాసి’ కృష్ణా, గుంటూరు 5 రోజుల కలెక్షన్స్ !

ఈ నెల 10వ విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టినా మొదటి షో నుండి ఏర్పడిన మిక్స్డ్ టాక్ వలన రెండవ రోజు నుండి తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా అత్యధికంగా రూ.9 కోట్లకు అమ్ముడైన గుంటూరు జిల్లాలో మొదటి రోజు రూ.3.78 కోట్లను రాబట్టిన ఆ తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. 5వ రోజు కేవలం రూ. 21.40 లక్షల్ని వసూలు చేయి మొత్తంగా 5 రోజులకు కలిపి రూ.4.52 కోట్లను ఖాతాలో వేసుకుంది.

అలాగే రూ. 8 కోట్లకు అమ్ముడైన కృష్ణా ఏరియాలో తొలిరోజు రూ.1.82 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు నుండి డీలా పడిపోయింది. 5వ రోజు రూ.21.40 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టి మొత్తంగా రూ.4.52 కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇక ఈరోజు రేపు పండుగ సెలవులు కావడం సినిమాకు ఒకింత కలిసొచ్చే అంశం కానుంది.