త్వరలో అజ్ఞాతవాసి సెన్సార్ !

పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అజ్ఞాతవాసి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 29 న ఈ సినిమా సెన్సార్ జరుపుకోనుంది. హాసిని & హారిక క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం ప్రధాన బలం కానుంది.

జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. అను ఇమ్మానుల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ పాడిన పాటను త్వరలో విడుదల చెయ్యనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. పవన్ నటించిన 25 వ సినిమా అవ్వడంతో ఈ మూవీ ని ప్రతిస్టాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్.