వరుస సర్ప్రైజులతో ‘అజ్ఞాతవాసి’ !

10th, December 2017 - 01:03:51 PM

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ‘అజ్ఞాతవాసి’ మేనియానే నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా తాలూకు పోస్టర్లు, విశేషాలే దర్శనమిస్తున్నాయి. అంతలా సందడి చేస్తున్న ఈ చిత్రం ఈ నెలలో వరుస సర్ప్రైజులతో అభిమానుల్ని మరింత హుషారెత్తించనుంది. ఈ చిత్రంలోని రెండవ సాంగ్ ‘గాలి వాలుగా’ 12వ తేదీన నేరుగా యూట్యూబ్ ద్వారా రిలీజ్ కానుంది. దీనికి చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ప్రత్యేకంగా ప్రమోషనల్ సాంగ్ ను కూడా డిజైన్ చేశారు.

ఇక చిత్ర టీజర్ ను ఈ నెల 15న విడుదల చేస్తారని వార్తలు వస్తుండగా ఆడియో వేడుక కూడా ఈ డిసెంబర్ నెలలోనే జరగనుంది. అయితే ఈ రెండు వార్తలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇండియా, యూఎస్ లలో జనవరి 10వ రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది.