ఆహా మరియు హాట్‌స్టార్ చెప్పబోయే అప్డేట్ “భీమ్లా”పైనే..!

ఆహా మరియు హాట్‌స్టార్ చెప్పబోయే అప్డేట్ “భీమ్లా”పైనే..!

Published on Mar 17, 2022 9:54 PM IST


ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఆహా మరియు హాట్ స్టార్‌లు ఈ రోజు రాత్రి 12 గంటలకు ఓ పవర్‌ఫుల్ అనౌన్స్‌మెంట్‌ని ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. అయితే ఈ అనౌన్స్‌మెంట్ ‘భీమ్లా నాయక్’ గురించే అని అర్ధమవుతుంది. ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ‘భీమ్లా నాయక్’ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై మరి కొద్ది గంటల్లో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. భారీ అంచనాల మధ్య గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని భారీగా కలెక్షన్లను రాబట్టుకుంటుంది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్‌గా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే ఇవ్వగా, థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు