ఆహా భోజనంబు: మంచు లక్ష్మీ తో సరికొత్త కబుర్లు చెబుతున్న నవదీప్!

Published on Sep 8, 2021 11:08 pm IST


ఆహా వీడియో డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఆహా భోజనంబు కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో వరుస గా సెలబ్రిటీ లతో వంటలతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం జరుగుతుంది. అదే విధంగా నవదీప్ తో సైతం షో నిర్వహించిన మంచు లక్ష్మీ సరికొత్త విషయాలను ఆహా భోజనంబు కార్యక్రమం లో వివరించడం జరిగింది.

ఆహా భోజనంబు నుండి తాజాగా ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో లో నవదీప్ పలు విషయాలను వెల్లడించారు. సన్నీ లియోన్ ను తొలిసారి హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత అంటూ చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ లో సన్ని లియోన్ నటించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆర్య 2 లో అల్లు అర్జున్ తో పాటుగా నటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పలు విషయాలను అడిగారు మంచు లక్ష్మీ. అంతేకాక మోహన్ బాబు గురించి అడగగా, ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ డైలాగ్ తో ఎంటర్ టైన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి విడియో సెప్టెంబర్ 10 వ తేదీన డిజిటల్ ప్రీమియర్ గా ఆహా వీడియో లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :