ఆహా ఎంటర్ టైన్మెంట్ అవార్డ్స్…విన్నర్స్ వీరే!

Published on Nov 3, 2021 7:13 am IST

తెలుగు లోకి అనూహ్యంగా ఓటిటి లోకి ఎంటర్ అయ్యి, ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది ఆహా వీడియో. వెబ్ సిరీస్ లతో, సరికొత్త చిత్రాలతో, డబ్బింగ్ చిత్రాలతో, సీరీస్ లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ఆహా వీడియో ఆహా ఎంటర్ టైన్మెంట్ అవార్డ్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సుహస్ మరియు చాందినీ చౌదరి లు నటించిన కలర్ ఫొటో ఎంపిక అయింది. అదే విధంగా బెస్ట్ యాక్టర్ మేల్ మరియు బెస్ట్ యాక్టర్ ఫిమేల్ సుహస్ మరియు చాందినీ చౌదరి లకు అవార్డు లభించింది. ఇక వెబ్ సిరీస్ లలో బెస్ట్ యాక్టర్ గా సత్యదేవ్ లాక్డ్ సీరిస్ కి అవార్డ్ రాగా, ది బేకర్ అండ్ ది బ్యూటీ సీరీస్ లో నటించిన తినా శిల్పారాజ్ కి బెస్ట్ యాక్టర్ ఫిమేల్ అవార్డ్ లభించింది. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ ది బేకర్ అండ్ ది బ్యూటీ లో నటించిన సంతోష్ శోభన్ కి రాగా, థాంక్యూ బ్రదర్ లో నటించిన అనసూయ భరద్వాజ్ కి బెస్ట్ యాక్టర్ ఫిమేల్ క్రిటిక్స్ అవార్డ్ రావడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More