బాలయ్య షోపై సాలిడ్ హైప్ తెస్తున్న “ఆహా”..మరిన్ని డీటెయిల్స్

Published on Oct 10, 2021 4:15 pm IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ఓటిటిలో “అన్ స్టాప్పబుల్” ఒక టాక్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మొట్ట మొదటి సారిగా తానే హోస్ట్ చెయ్యడానికి రెడీ అవ్వడం నిజంగా ప్రతీ ఒక్కరికీ కూడా ఒక సరికొత్త ఉత్సాహాన్ని అందించింది. అంతే కాకుండా ఈ షో పై ఒక్కక్కటిగా సమాచారం బయటకి వస్తుంటే బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగానే ఆహా వారు సాలిడ్ గానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని అర్ధం అవుతుంది. మరి ఇదిలా ఉండగా వారు లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ కూడా మంచి ఎనర్జిటిక్ గా సాలిడ్ గా ఉందని చెప్పాలి.

“ఆయన అడుగేసి షో మొదలెడితే.. అన్ని టాక్ షో లకి బాప్ లాంటి షో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ కి రెడీగా ఉండండి” అంటూ ఆహా వారు ఒక ప్రీ లుక్ పోస్టర్ ని కూడా వదిలారు. దీనితో ఈ షో పై మరింత హైప్ పెరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మొత్తం షోని ఒక పది ఎపిసోడ్స్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ పది కూడా బాలయ్య మార్క్ లో అదిరే లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతానికి అయితే దీపావళి కానుకగా ఈ షో స్టార్ట్ అవ్వనుంది అని టాక్ ఉంది. మరి అప్పుడు వస్తుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :