వెంకీ మామతో సరికొత్త షోని ప్లాన్ చేస్తున్న “ఆహా”?

Published on Jan 20, 2022 12:04 am IST

టాలీవుడ్‌లో వెండితెరపై సత్తా చాటిన చాలా మంది స్టార్ హీరోలు, బుల్లితెరపై హోస్ట్‌లుగా కూడా అలరిస్తూ అభిమానులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్‌టీఆర్, నాని, రానాలు పలు షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ఇటీవల ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్‌ షో ద్వారా బాలకృష్ణ కూడా హోస్ట్‌గా మారిపోయాడు.

టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుండడంతో డిజిటల్ ప్లాట్ ఫాంలో ఈ టాక్‌ షో విజయవంతంగా దూసుకెళ్తుంది. దీంతో మరో కొత్త టాక్ షోని ప్రారంభించాలని ఆహా ప్రయత్నిస్తుందట. ఈ సరికొత్త టాక్‌ షోకి విక్టరీ వెంకటేశ్‌ని హోస్ట్‌గా చేయించాలని భావిస్తున్నారని, ఇప్పటికే దీని గురుంచి ‘ఆహా’ టీమ్‌ వెంకటేశ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే త్వరలోనే దీనికి సంబంధించి అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :