‘పాపం పసివాడు’ వెబ్ సిరీస్ నుండి పాటను రిలీజ్ చేసిన ఆహా

Published on Sep 20, 2023 12:00 pm IST

ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా వారి లేటెస్ట్ వెబ్ సిరీస్ పాపం పసివాడు. సింగర్ శ్రీరామచంద్ర కథానాయకుడిగా నటిస్తున్న ఈ సిరీస్ లో రాశీసింగ్‌, గాయత్రి చాగంటి, శ్రీవిద్యా మహర్షి తదితరులు కీలక పాత్రలు పోషించగా ది వీకెండ్ షో బ్యానర్‌ పై అఖిలేష్ వర్ధన్ దీనిని నిర్మించారు. ఇక ఈ సిరీస్ ఒరిజినల్‌లోని టైటిల్ సాంగ్ ని నేడు రిలీజ్ చేశారు. సిరీస్‌లోని పాత్రలను తరచి చూస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ సాంగ్ లో ఆవిష్కిరంచారు.

మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మీ స్వరపరిచిన ఈ ర్యాప్ సాంగ్ ని రాసి పాడినవారు ఆదిత్య రావ్ గంగసాని, కాగా ఓకల్స్ ని కార్తీక వైద్యనాథన్ అందించారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం జరిగింది అనే విషయాన్ని అందరూ ఎంజాయ్ చేసేలా చక్కగా తెరకెక్కించారు.

ఇందులో పాతికేళ్ల కుర్రాడైన కథానాయకుడు క్రాంతి ప్రేమ కోసం హృదయమంతా బాధతో పరితపిస్తూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో అతని జీవితంలో ఊహించని ఘటనలు జరుగుతాయి. లైఫ్ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ రొమాంటిక్ జర్నీ చుట్టూ కథ నడుస్తున్నప్పుడు తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది. మొత్తంగా సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న పాపం పసివాడు సిరీస్ ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారని అంటున్నారు మేకర్స్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :