దసరా నుండి సంక్రాంతి వరకూ ఆహా లో నాన్ స్టాప్ వినోదాల పండుగ!

Published on Oct 10, 2021 7:00 pm IST

డిజిటల్ రూపంలో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆహా వీడియో. సరికొత్త సినిమాలతో, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆహా వీడియో ఇప్పుడు నాన్ స్టాప్ వినోదాల పండుగ కి సిద్దం అయ్యింది. 12 వారాలు, 90 రోజులు, 20 కొత్త సినిమాలు మరియు షో లతో ఆహా వీడియో అలరించడానికి సిద్దం అవుతుంది. దసరా నుండి సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ, మీ ఆహా లో, సిద్దమా అంటూ ఆహా వీడియో చెప్పుకొచ్చింది. అయితే ఇందులో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య, సాయి పల్లవి ల లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య, రాజ్ తరుణ్ అనుభవించు రాజా, వరుణ్ తేజ్ ల గని చిత్రాలు కూడా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :