అన్ స్టాపబుల్2: పవన్ ఎపిసోడ్ 2 స్పెషల్ గ్లింప్స్ రెడీ!

Published on Feb 9, 2023 1:27 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటుపక్క రాజకీయాల్లో ఉంటూనే, మరొక పక్క సినిమాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ లో నందమూరి బాలకృష్ణ ఆహా వీడియో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్2 కి గెస్ట్ గా విచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ విడుదలై సెన్సేషన్ రెస్పాన్స్ ను కొల్లగొట్టగా, ఇప్పుడు రెండవ ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ఆహా వీడియో లో ఎపిసోడ్ 2 ప్రసారం కానుంది.

అయితే ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబందించిన స్పెషల్ గ్లింప్స్ ను 3 గంటలకు విడుదల చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ గ్లింప్స్ పై మరింత ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ లో తన వ్యక్తిగత విషయాలను మాత్రమే కాకుండా, రాజకీయ, సినీ విశేషాలు కూడా పంచుకోబోతున్నారు.

సంబంధిత సమాచారం :