అసాధారణ విజయాన్ని సాధించిన ఆహా ఒరిజిన‌ల్ సిరీస్ ‘న్యూసెన్స్’ సరికొత్త రికార్డ్స్

Published on May 18, 2023 12:03 am IST

తెలుగు రాష్ట్రాల్లో ఆహా ఓటిటి మాధ్యమం ప్రస్తుతం మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అద్భుత‌మైన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ స‌రికొత్త బెంచ్ మార్క్‌ల‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఆహా లో రిలీజ్ అయి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటోంది. నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో అలరించే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే తో ఈ సిరీస్ తెరకెక్కింది. న్యూసెన్స్ సీజ‌న్ 1 విష‌యానికి వ‌స్తే 1990-2000 ద‌శంలో ఏపీలోని మ‌ద‌న‌ప‌ల్లిలోని స్ట్రింగ‌ర్స్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. మ‌న స‌మాజంలోని మీడియాకున్న ప్రాధాన్య‌త‌ల‌పై ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తిందీ సిరీస్‌.

వార్త‌ల‌ను తెలియ‌జేయ‌టం, సంచ‌ల‌నాత్మ‌క వార్త‌ల ప్ర‌భావం వంటి అంశాల‌ను ఈ సిరీస్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. అలానే దానికి త‌గ్గ పాత్రధారుల యొక్క పెర్ఫామెన్స్‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఆహా వారి ఈ ఈ సరికొత్త వెబ్ ఒరిజినల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సిరీస్ ప్రస్తుతం ఓ తుపానులా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఇక ఈ సిరీస్ అసాధార‌ణ విజ‌యాన్ని సాధించిన సంద‌ర్భంగా న్యూసెన్స్ స‌క్సెస్‌మీట్‌ను తాజాగా చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ సిరీస్‌కు త‌మ‌దైన న‌ట‌న‌, సాంకేతిక‌త‌తో తిరుగులేని విజ‌యాన్ని అందించిన టీమ్ ఈవెంట్‌లో పాల్గొంది. ముందుగా దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ న్యూసెన్స్ సిరీస్‌ను అంద‌రం ఎంతో ప్రేమించి చేశాం. అందువ‌ల్ల‌నే ఇంత‌టి అపూర్వ‌మైన విజ‌యం ద‌క్కింది.

అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆహా, పీపుల్ మీడియా వారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం గొప్ప అనుభూతినిచ్చింది. వారు అందించిన స‌హయ స‌హ‌కారాల‌తోనే మేం అనుకున్న క‌థ‌ను అనుకున్న‌ట్లు తెర‌కెక్కించ‌గ‌లిగాం అన్నారు. టీమ్ అంతా పాల్గొన్న ఈ స‌క్సెస్‌మీట్ అద్భుతంగా జ‌రిగింది. ఇదే సంద‌ర్భంలో ఫ్యాన్స్ కోసం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు . మ‌రికొన్ని వారాల్లోనే న్యూసెన్స్ సీజ‌న్ 2ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన, ఆలోచ‌న‌ను రేకెత్తించేలా ఉత్కంఠభ‌రిత‌మైన క‌థాంశంతో ముందుకు వ‌స్తామ‌ని ఈ సంద‌ర్భంగా టీమ్ తెలియ‌జేసింది.

సంబంధిత సమాచారం :