‘నన్ను పెళ్లి చేసుకుంటావా ?’.. హీరోయిన్ కి కాంగ్రెస్‌ నేత కుమారుడు ప్రపోజల్ !

Published on Jan 2, 2022 7:21 pm IST

మాజీ బ్యూటీ అమీషా పటేల్ ప్రస్తుతం పెళ్లి ప్రపోజల్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమీషా పటేల్ దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ తనయుడు ఫైజల్‌ పటేల్‌ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉందని పుకార్లు వినిపించాయి. అయితే, ఆ పుకార్ల పై అమీషా పటేల్ ఇన్నాళ్లు స్పందించలేదు. కానీ, తమ ప్రేమ బంధం పై ఇటు అమీషా పటేల్ – అటు ఫైజల్‌ పటేల్‌ ఒక మెసేజ్ తో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఫైజల్‌ 41వ బర్త్‌ డే సందర్భంగా గ్రాండ్‌ పార్టీ ఇచ్చాడు. అయితే, ఫైజల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు’ అని అమీషా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కి ఫైజల్‌ ఆసక్తికరంగా స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ అమీషా పటేల్‌. ఈ సందర్భంగా పబ్లిక్‌ గా నీకు ప్రపోజ్‌ చేస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని మెసేజ్ చేస్తూ పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, కాసేపటికే ఫైజల్‌ ఆ ట్వీట్‌ ను డిలీట్‌ చేశాడు.

సంబంధిత సమాచారం :