ఆకట్టుకుంటున్న “ఐరావతం” టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్!

ఆకట్టుకుంటున్న “ఐరావతం” టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్!

Published on Nov 17, 2021 12:00 PM IST


రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ఐరావతం. ఈ ఐరావతం ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ, “ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ టూ మై ప్రొడ్యూసర్స్. ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ, “ఈ చిత్రాన్ని కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ తో అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు” అని అన్నారు.

అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సుహాస్ మీరా అందిస్తున్నారు. సురేష్ దుర్గం ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ కె వల్లపు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సత్యా కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు