మహేష్ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ?

Published on Jan 30, 2023 9:00 am IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమాలో ఇప్పుడు ఓ కీలక పాత్రలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నటించబోతుందని తెలుస్తోంది. ఆమెది ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని, ఐశ్వర్య రాయ్ – మహేష్ బాబు పాత్రల మధ్య డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్ మహేష్ ఫ్యాన్స్ ను తెగ ఎగ్జైట్ చేస్తోంది.

ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. కాగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు ఈ సినిమా ఢిల్లీ నేపథ్యంలో రాబోతున్న పొలిటికల్ డ్రామా అని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి.

సంబంధిత సమాచారం :