మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గదు…మహా సముద్రం పై అజయ్ భూపతి కీలక వ్యాఖ్యలు!

Published on Sep 24, 2021 2:40 pm IST


శర్వానంద, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం.అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి, ప్రేక్షకులని, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మేరకు ఈ సినిమా ట్రైలర్ పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా ట్రెయిలర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.RX10,000 లా సినిమా ట్రైలర్ ఉందని అన్నారు. ఈ మేరకు దర్శకుడు అజయ్ భూపతి స్పందిస్తూ, మీ అంచనాలకు ఏమాత్రం తగ్గదు, పక్కా అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :