RRR: అజయ్ దేవగన్ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి..!

RRR: అజయ్ దేవగన్ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి..!

Published on Dec 7, 2021 12:42 AM IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం భారీ స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ కూడా డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం అజయ్ దేవగన్ చిత్ర యూనిట్‌ని కలవడం మరియు ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్‌ని కలిపి ఓ చిన్న వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

https://www.instagram.com/reel/CXJReZahqAs/?utm_medium=copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు