మరింత పవర్ ఫుల్ గా అజయ్ దేవగణ్ “భోళా” ట్రైలర్

Published on Mar 6, 2023 11:26 pm IST


అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ భోళా. తమిళం లో సూపర్ హిట్ అయిన ఖైతీ కి ఇది అధికార రీమేక్. తెలుగు లో ఖైదీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కనగరాజ్ తమిళం లో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కి పలు మార్పులు చేసి, తెరకెక్కించారు భోళా మేకర్స్. ఈ చిత్రం ను మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరం గా సాగింది. టబు, సంజయ్ మిశ్రా, దీపక్ దొబ్రియల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :