“RRR” కి భారీ మొత్తంలో తీసుకున్న అజయ్ దేవగన్, ఆలియా.?

“RRR” కి భారీ మొత్తంలో తీసుకున్న అజయ్ దేవగన్, ఆలియా.?

Published on Jan 12, 2022 1:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఆల్ మోస్ట్ రిలీజ్ అయ్యిపోతుంది అనగా లాస్ట్ మినిట్ లో కరోనా కేసులు పెరిగి భారీ మార్పు తీసుకొచ్చింది.

దీనితో మళ్ళీ రిలీజ్ సందిగ్ధం లోకి వెళ్ళిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్ మరియు ఆలియా భట్ లు కోసం తెలిసిందే. ఇద్దరూ కూడా సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలే చేసినట్టుగా లేటెస్ట్ ట్రైలర్ లో చూస్తే అర్ధం అవుతుంది.

మరి ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఈ సినిమాకి ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే భారీ ఫిగర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఇద్దరిలో అజయ్ దేవగన్ తన పాత్రకి భారీ మొత్తంలో 35 కోట్లు తీసుకోగా ఆలియా భట్ తన క్యామియో రోల్ కి గాను 9 కోట్లు ఛార్జ్ చేసిందట. మరి ఇప్పుడు ఈ లెక్కలే బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు